Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్ ఐరన్ డోమ్
posted on: Jun 16, 2026 3:24PM

చాప్టర్ 1
చండీపూర్‌లో వరుసగా మూడు విజయవంతమైన ఫ్లైట్ పరీక్షలతో, ఇంటర్మీడియట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్-IRBM రక్షణకు రూపొందించిన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను భారత్ ధృవీకరించింది. 2,000–5,000 కి.మీ పరిధిలోని శత్రు బాలిస్టిక్ ముప్పులను ఎండో–అట్మాస్ఫెరిక్, ఎగ్జో–అట్మాస్ఫెరిక్ దశల్లో అడ్డుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా.. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, నాటో గ్రూపుల వంటి కొద్ది దేశాలున్న ఉన్నత స్థాయి వర్గంలో భారత్ అధికారికంగా చేరింది.
చాప్టర్ 2
ఇండియా ఐరన్ డోమ్ గా అభివర్ణించబడుతున్న ఈ మల్టీలెవల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ-BMD నిర్మాణం, కేవలం శత్రు క్షిపణులను అడ్డుకోవడమే కాదు.. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన, దూసుకొస్తున్న క్షిపణులను గాలిలోనే నిర్వీర్యం చేసి, జాతీయ భూభాగం, కీలక మౌలిక సదుపాయాలు, అత్యంత విలువైన వైమానిక ఆస్తులను రక్షించే వ్యూహాత్మక కవచంగా రూపుదిద్దుకుంటోంది.
చాప్టర్ 3
PAD–AAD, AD1–AD2 వంటి ఇంటర్‌సెప్టర్ వ్యవస్థల విజయవంతమైన పరీక్షలు, భారత రక్షణ వ్యవస్థను దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి స్వదేశీ క్షిపణి రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేసి, ప్రపంచ వ్యూహాత్మక సమీకరణలో తన స్థానాన్ని పునర్నిర్వచించే దేశం”గా మారుస్తున్నాయి.
బాలిస్టిక్ క్షిపణి రక్షణ-BMD వ్యవస్థలు- ప్రపంచంలో అత్యంత సంక్లిష్ట, అధునాతన రక్షణ నిర్మాణాలలో ఒకటి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, నాటో వంటి కొద్ది దేశాలు మాత్రమే, దూసుకొస్తున్న బాలిస్టిక్ క్షిపణులను ఎండో–అట్మాస్ఫెరిక్ అంటే, వాతావరణంలో ఎగ్జో–అట్మాస్ఫెరిక్ అంటే, వాతావరణం వెలుపల- దశల్లో అడ్డుకునే సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేసి, మోహరించాయి.
భారత్‌లో BMD భావన 2000వ దశక ప్రారంభంలోనే రూపుదిద్దుకుంది. పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తుండగా, భారత భూభాగం, మెట్రో నగరాలు, కీలక మౌలిక సదుపాయాలు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను రక్షించడానికి, స్వదేశీ క్షిపణి రక్షణ కవచం అవసరమని తెలిసింది.
DRDO ఆధ్వర్యంలో ప్రారంభమైన BMD ప్రోగ్రామ్, మొదట పృధ్వీ- PAD, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వంటి ఇంటర్‌సెప్టర్ వ్యవస్థలతో ఫేజ్- I నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. తరువాత, AD-1, AD-2 వంటి అధునాతన ఇంటర్‌సెప్టర్‌లు ఫేజ్-II నిర్మాణంలో భాగమయ్యాయి. ఈ ప్రయాణం, ఇండియాకి చెందిన ఐరన్ డోమ్ గా అభివర్ణించబడుతున్న బహుళ–అంచెల, బహుళ–స్థాయి రక్షణ కవచానికి పునాది వేసింది.
ఈ సంఘటనల కాలక్రమం ఎలాంటిదో చూస్తే.. మూడు ఫ్లైట్ పరీక్షలు, AD-1–AD-2 ధృవీకరణ, PAD, AAD సమీకరణ.. వంటి ఘటనలు నమోదు కాగా.. చండీపూర్‌లో మూడు వరుస ఫ్లైట్ పరీక్షలు జరిగాయి.
2026 జూన్ 10–11 తేదీల్లో ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-ITR నుంచి DRDO వరుసగా మూడు ఫ్లైట్ పరీక్షలను నిర్వహించింది.
రెండు ఇంటర్‌సెప్టర్ క్షిపణులు – ఇంటర్మీడియట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్- IRBM రక్షణగా వర్గీకరించబడ్డ అధునాతన వ్యవస్థలుండగా వాటి పరిధి.. 2,000–5,000 కి.మీ మధ్య సిమ్యులేటెడ్ బాలిస్టిక్ ముప్పులు కాగా, ఎండో–అట్మాస్ఫెరిక్ అండ్ ఎగ్జో–అట్మాస్ఫెరిక్ అడ్డగింపు – భూమధ్య, భూ బాహ్య ప్రాంతాల్లో ఇంటర్ సెప్షన్ కి సంబంధించినవి. ఈ పరీక్షల్లో, దూసుకొస్తున్న లక్ష్యాలను ముందుగా రాడార్ నెట్‌వర్క్ గుర్తించింది. రియల్ టైం ట్రాకింగ్ ద్వారా ట్రాజెక్టరీని విశ్లేషించింది. కమాండ్–అండ్–కంట్రోల్ సిస్టమ్ ఇంటర్‌సెప్టర్‌లకు ఫైరింగ్ సొల్యూషన్ అందించింది. ఇంటర్‌సెప్టర్‌లు గాలిలోనే లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించి, ధ్వంసం చేశాయి.
భారత రక్షణ రంగానికి చెందిన కొన్ని నివేదికల ప్రకారం- ఈ మూడు పరీక్షల్లో DRDO.. AD-1 – ఎండో–అట్మాస్ఫెరిక్ లో–ఎగ్జో–అట్మాస్ఫెరిక్ అడ్డగింపునకు రూపొందించిన, రెండు–దశల సాలిడ్ ఫ్యూయెల్ ఇంటర్‌సెప్టర్ కాగా, ఇక రెండోది.. AD-2 – అధిక ఎగ్జో–అట్మాస్ఫెరిక్ ఇంటర్ సెప్షన్ కు రూపొందించిన, ICBM–క్లాస్ ముప్పులను అడ్డుకునే ఔటర్ లేయర్- ఇంటర్‌సెప్టర్ ని విజయవంతంగా పరీక్షించింది.
AD-1 విషయానికి వస్తే.. MRBM–IRBM తరహా ముప్పులతో పాటు, కొన్ని వైమానిక ముప్పులను కూడా..ఇండిజీనియస్ గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్ తో అడ్డుకునే సామర్ధ్యం కలిగి ఉంది.
ఇక AD-2 ICBM–క్లాస్, DF41 తరహా ముప్పులను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ వార్ హెడ్స్ వంటి సంక్లిష్ట ముప్పులను భూమి వాతావరణం వెలుపల, అధిక ఎత్తులో అడ్డుకునే ఔటర్ లేయర్ షీల్డ్ గా పనిచేస్తుంది.
PAD–AAD ఫేజ్-I నిర్మాణం, మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ తదితతర నివేదికల ప్రకారం, DRDO గత పరీక్షల్లో.. PAD – ఎక్కువ ఎత్తులో ఇంటర్ సెప్షన్, AAD – తక్కువ ఎత్తులో ఇంటర్ సెప్షన్ సమీకృతంగా పనిచేసే కాంపోసైట్ వ్యవస్థను ధృవీకరించింది. 600 కి.మీ, 800 కి.మీ, 1,000 కి.మీ ట్రాజెక్టరీస్ పై సిమ్యులేటెడ్ టార్గెట్స్ ను PAD–AAD కాంపోసైట్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం, మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ ఆపరేషనల్ వయబిలిటీని చూపించింది.
BMD వ్యవస్థ.. జాతీయ భూభాగం, మెట్రో నగరాలు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన శత్రు క్షిపణుల ముప్పు నుంచి రక్షించడానికి రూపొందించారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే బాలిస్టిక్ క్షిపణులను గాలిలోనే నిర్వీర్యం చేయడం, అంతర్జాతీయ న్యాయపరమైన చర్చల్లో డిఫెన్సివ్ డిటెర్రెన్స్ గా పరిగణించబడుతోంది. ఇది అణ్వాయుధ వినియోగాన్ని నిరోధించే రెటలియటరీ స్ట్రైక్ అవసరాన్ని తగ్గించే ఎస్కలేషన్ కంట్రోల్ కి సహాయ పడే వ్యవస్థగా కూడా విశ్లేషించబడుతుంది.
మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ- MTCR పరిమితుల నేపథ్యంలో, భారత్ తన BMD నిర్మాణాన్ని..
స్వదేశీ సాంకేతికత- ఇండిజీనియస్ రాడార్స్, గైడెన్స్, ఇంటర్ సెప్టార్స్, ఆధారంగా అభివృద్ధి చేశారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ విజయవంతమైన పరీక్షలతో భారత్.. యూఎస్, రష్యా, ఇజ్రాయెల్, నాటో తో పాటు ICBM–క్లాస్ ముప్పులను అడ్డుకునే సామర్థ్యం ఉన్న కొద్ది దేశాల క్లబ్లో అధికారికంగా చేరింది.
భారత రక్షణ నిపుణులు, ప్రభుత్వ వర్గాలు ఈ పరీక్షలను.. జాతీయ భద్రతకు పెద్ద ప్రోత్సాహం, వ్యూహాత్మక నిరోధక సామర్థ్యానికి మద్దతునివ్వడంతో పాటు.. వాయు రక్షణ సంసిద్ధతకు కీలక మైలురాయి గా అభివర్ణిస్తున్నారు.
పాకిస్తాన్ ఫతేహ్-I, ఫతేహ్-II, చైనీస్ ఆరిజన్- P282 వంటి దీర్ఘ–పరిధి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తుండగా.. DRDO- BMD ప్రోగ్రామ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఈ పరీక్షల రాజకీయ–వ్యూహాత్మక నేపథ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
కొన్ని మీడియా కథనాలు దీన్ని డెవలపింగ్ ఇండియాస్ ఐరన్ డోమ్ గా అభివర్ణించాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్- షార్ట్ రేంజ్ రాకెట్స్, ఆర్టిలరీ షెల్స్ ఇంటర్ సెప్షన్ కి ప్రసిద్ధి. అర్బన్ సెంటర్స్, క్రిటికల్ అసెట్స్ రక్షణకు కీలక వ్యవస్థ.
ఇక భారత్- BMD విషయానికి వస్తే.. మీడియం రేంజ్, ఇంటర్ మీడియట్ రేంజ్, ICBM–క్లాస్ బాలిస్టిక్ ముప్పులను అడ్డుకునే.. మల్టీ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అయినా, ఇండియాస్ ఐరన్ డోమ్ అనే వాదన తెరపైకి వచ్చింది. ఇది సాంకేతిక సంక్లిష్టతను సులభంగా అర్థమయ్యేలా.. రక్షణ కవచం అనే భావనను స్పష్టంగా చూపించేలా.. ఉపయోగపడుతోంది.
కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం.. DRDO ఈ పరీక్షలపై అధికారిక ప్రకటన చేయకపోయినా, రక్షణ వర్గాలు, ఇతర విశ్లేషణలు పరిశీలిస్తే, మల్టీ లేయర్డ్- BMD ఆర్కిటెక్చర్, IRBM–ICBM ఇంటర్ సెప్షన్ కేపబిలిటీ.. నావల్ యాంటీ షిప్ మిస్సైల్ మీడియం రేంజ్ మెయిడెన్ ట్రైల్ వంటి అంశాలను విస్తృతంగా చర్చించాయి.
ఈ విజయవంతమైన పరీక్షలు ఎలాంటివో పరిశీలిస్తే.. జాతీయ భద్రత – శత్రు బాలిస్టిక్ ముప్పులను అడ్డుకునే కాంక్రీట్ కేపబిలిటి, వ్యూహాత్మక నిరోధకత – అడ్వర్సరీస్ ప్లానింగ్ లో అన్ సెర్టినిటీ, డిటెరెన్స్..
వాయు రక్షణ సంసిద్ధత – మల్టీ లేయర్డ్ షీల్డ్ ఆపరేషనల్ వయబిలిటీ కోణాల్లో భారత స్థాయిని గణనీయంగా పెంచాయి.
స్వదేశీ గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్, రాడార్స్, ఇంటర్ సెప్టార్స్ తో సాంకేతిక స్వయం సమృద్ధి
దిగుమతులపై ఆధారపడకుండా, ఇండిజీనియస్ ఇన్నోవేషన్, భారత్ BMD నిర్మాణం ద్వారా స్పష్టమవుతోంది. ఇది DRDO, భారత రక్షణ రంగ పరిశ్రమకు చెందిన ప్రైవేట్ సెక్టార్ లో హై ఎండ్ ఆర్ అండ్ డీ అవుతోంది. అంటే, పరిశోధన మరియు అభివృద్ధి అవుతోంది. కాంప్లెక్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, ఎక్స్ పోర్ట్ పొటెన్షియల్ వంటి అంశాలను ఇది తిరిగి యాక్టివేట్ చేస్తుంది.
భారత్ ఇప్పటివరకు BMD కేపబిలిటీలో డెవలపింగ్ స్థాయిలో ఉండేది. ఇప్పుడు IRBM–ICBM–క్లాస్ ఇంటర్ సెప్షన్ కేపబిలిటీని డెమోనిస్ట్రేషన్ చేసి చూపింది.
నిజానికి యూఎస్, రష్యా, ఇజ్రాయెల్, నాటో గ్రూపింగ్ తో పాటు మల్టీ లేయర్డ్ బీఎండీ ఆర్కిటెక్చర్ ఆపరేషనల్ వయబిలిటీని చూపిన కొన్ని దేశాల్లో.. భారత్ ఒకటి. ఇక పాక్. చైనా- పరిధి క్షిపణి అభివృద్ధి వేగాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ నిర్మాణం లగ్జరీ కాదు. జాతీయ భద్రతకు అవసరమైన కవచం. DRDO, భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, దశాబ్దాల తరబడి కృషితో.. ఇండియాస్ ఐరన్ డోమ్ గా అభివర్ణించబడుతున్న బహుళ–అంచెల కవచాన్ని నిర్మించారు. ఇది కేవలం ఒక సాంకేతిక కథ కాదు..ఇది భారత రక్షణ ప్రస్థానం, సాంకేతిక స్వయం సమృద్ధి, వ్యూహాత్మక నిరోధకత కలిసిన ఒక కీలక మలుపు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






