Latest News

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు... భారీ నష్టాలు

posted on: Mar 19, 2026 4:44PM

 

పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు, అమెరికా జోక్యం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు ఇన్వెస్టర్ల కొంపముంచాయి. గురువారం (మార్చి 19) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు మార్కెట్‌ను మరింత భయపెట్టాయి. 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 110 డాలర్ల మార్కును దాటింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుంది. దాంతో ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుంది. యుద్ధం కారణంగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది దిగుమతులను మరింత ప్రియం చేస్తూ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాన్ని చూపుతోంది. 

మరోవైపు, అమెరికా స్టాక్ మార్కెట్ డౌ జోన్స్, జపాన్‌కు చెందిన నిక్కీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో భారతీయ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని గంటల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్స్యూమర్ సెక్టార్ షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేవలం డిఫెన్స్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ షేర్లు మాత్రమే స్వల్పంగా నిలదొక్కుకున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...