సియాచిన్‌లో పదిమంది సైనికులు గల్లంతు

posted on: Feb 3, 2016 3:40PM

 

ఇండో- పాక్‌ సరిహద్దులో ఉన్న సియాచిన్‌లో దాదాపు పదిమంది భారతీయ సైనికులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా 18 వేల అడుగుల ఎత్తున పహారా కాస్తుండగా ఒక హిమపాతంలో కొట్టుకుపోయినట్లు సమాచారం.

* సియాచిన్‌ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సైనిక స్థావరం.

* ధృవ ప్రాంతాల తరువాత అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం కూడా ఇదే.

* చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు -50 డిగ్రీలకు పడిపోతాయి.

* సియాచిన్‌లో పహారా కాసే సైనికులు శత్రుదేశ దాడికంటే ప్రకృతి చేసే విలయంలోనే ఎక్కువగా ప్రాణాలను కోల్పోతూ ఉంటారు.

*రక్తాన్ని గడ్డకట్టించే చలి, గుండెపోటు, హిమపాతాలు, మంచు తుపానులు, కొండల మీద నుంచి జారిపడటం... వంటి కారణాల వల్ల ఇప్పటివరకు వేలాదిమంది భారతీయ సైనికులు ప్రాణాలు విడిచారు.

* సియాచిన్‌కు ఇటువైపు ఉండే భారత సైనికులే కాదు అటువైపున ఉండే పాకిస్తాన్‌ సైనికులు కూడా చలికి బలైపోతుంటారు.2012 ఏప్రిల్ నెలలో 129 మంది పాకిస్తాన్‌ సైనికులు ఇలాగే ప్రాణాలను కోల్పోయారు.
 

సియాచిన్‌లో ఇలా అనవసరంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు, అక్కడి అరుదైన పర్యావరణాన్ని రక్షించేందుకు భారత్‌-పాక్‌లు కలిసి ఆ ప్రదేశాన్ని ‘శాంత స్థావరం’గా ప్రకటించాలని మేధావులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ…

 

google-ad-img
    Related Sigment News
    • Loading...