Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరిస్థితులు తారుమారు.. ఒకప్పుడు పప్పులు.. ఇప్పుడు హీరోలు.!
posted on: Aug 10, 2026 2:57PM

భారతీయ రాజకీయాల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువగా వినిపిస్తున్న, చర్చనీయాంశమైన పదాలలో పప్పు అన్న మొదటి వరుసలో ఉంటుంది. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించడానికి రాజకీయ నాయకులు తరచూ ఈ పప్పు పదాన్ని ఉపయోగించారు. జాతీయ రాజకీయాలలో ఈ పప్పు అన్న పదానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపుతూ ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేసేవారు.
అలాగే ఏపీలో పప్పు పద ప్రయోగానికి ఎక్కువగా గురైన వారు నారా లోకేష్. లోకేష్ తన యువగళం పాదయాత్ర ద్వారా కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారే లోకేష్ పరిణితిని, ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరును ప్రశంసించాల్సిన పరిస్థితిలో పడ్డారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారు ఇప్పుడు సైలెంటైపోయారు. పప్పు అన్న పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మారుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతోంది. అలాగే జాతీయ రాజకీయాలలో కూడా రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేతగా మేకోవర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కాలంతో పాటు రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది. రాజకీయ విశ్లేషకులు , మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనా విధానం, యువత స్పందన, నాయకుల ఇమేజ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే వాదనలు, ప్రభుత్వ పనితీరుపై వచ్చే గణాంకాలు ఈ రాజకీయ పదాల పుట్టుకకు, వాటి అర్థం మారడానికి కారణం అవుతున్నాయి. లోక్‌సభలో జరిగిన చర్చల సమయంలో కొందరు ఎంపీలు ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక వృద్ధి రేటు వంటి అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సమయంలో తయారీ రంగంలో నమోదైన ప్రతికూల వృద్ధి రేట్లు, ఆర్థిక సంక్షోభ సూచీలను ఉదహరిస్తూ, అసలైన అసమర్థత ఎవరిదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. సమాజంలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, కేవలం సోషల్ మీడియా ప్రచారాలు లేదా క్యూరేటెడ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్ శాశ్వతం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో మారుతున్న యువత ఆలోచనా ధోరణి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఆర్థిక అసమానతలు వంటి వాస్తవ సమస్యలను ప్రజలు గమనిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్లు, మీమ్స్, క్రియేటర్ ఎకానమీ ద్వారా రాజకీయ నాయకుల వ్యూహాలను యువత తిప్పికొడుతోంది.
ఒకప్పుడు ఒకరిని అప్రతిష్ఠపాలు చేయడానికి వాడిన పప్పు అన్న పదమే ఇప్పుడు బూమరాంగ్ అయ్యి.. ఎవరిని ఇరుకున పెడుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, ప్రజాస్వామ్యంలో ఏ ఇమేజ్ కూడా శాశ్వతం కాదని, ప్రజల చైతన్యమే అంతిమ తీర్పును ఇస్తుందని చరిత్ర పదే పదే నిరూపిస్తుంటుంది. రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎగతాళి చేసిన వారూ, యువత అంటే 59 ఏళ్ల యువకులు కారంటూ ఎద్దేవా చేసిన వారూ ఇప్పటి పరిస్థితుల్లో యూత్ ట్రోలింగ్ కు గురి కావడమే కాకుండా వాస్తవ సరిస్థితులలో అడుగు వెనక్కు వేసి మరీ ఆబోరు కాపాడుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు.
Indian politics, Pappu political term, Parliament debate, economic indicators, political narrative, Trolling, bumarang



.webp)


