ఆసీస్‌పై భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం
posted on: Feb 21, 2026 4:37PM

ఆడిలైడ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ మహిళ జట్టు ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. స్మృతి మంధాన (82 రన్స్), జెమిమా రోడ్రిగ్స్ (59 రన్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. షఫాలీ వర్మ (7 పరుగులు), రిచా ఘోష్ (18 పరుగులు) విఫలమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో అనబెల్ సుదర్లాండ్ 2, సోఫీ, కిమ్ గార్త్ చెరో 1 వికెట్ పడగొట్టారు.177 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన కంగారులు 159/9 పరుగులకే చేసింది. అష్లీ గార్డ్నర్ (57 పరుగులు) మాత్రమే రాణించింది. భారత బౌలర్లలో శ్రేయాంకా పాటిల్, శ్రీ చరణి చెరో 3, అరుంధతి రెడ్డి 2, రేణుకాసింగ్ ఠాకూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలవగా, రెండో టీ20లో ఆసీస్ విజయం సాధించింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన తాజా టీ20లో నెగ్గిన టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.



.webp)


