Latest News
లంచ్ సమయానికి భారత్ 503/7...
posted on: Jul 27, 2017 12:40PM

భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభమైంది. 399/3 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ కొద్ది సేపటికే పుజారా(153), రహానె(57) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, సాహా నెమ్మదిగా ఆడి పరుగులు రాబట్టారు. ఆ తరువాత హెరాత్ వేసిన బంతిని ఎదుర్కొన్న సాహా.. పెరీరాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ప్రదీప్ బౌలింగ్‌లో అశ్విన్(47) డిక్వెల్లాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్య(4), జడేజా(8) ఉన్నారు.


.jpg)
.jpg)


