Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీకు తెలుసా.. ఇండియా మూడో అతి పెద్ద స్టార్టప్ కంట్రీ!
posted on: May 2, 2026 10:02AM

ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్... అని మీకు తెలుసా? ఉద్యోగాలను వెతకడం మాత్రమే కాదు.. ఉద్యోగాల సృష్టి చేస్తోంది మన యువత. 2026 నాటికి మన వాళ్ల అత్యంత విజయవంతమైన స్టార్టప్స్ ఏవని చూస్తే.. క్విక్ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో జెప్టో- ఆదిత్య పాలిచ, కైవల్య వోహ్రా తమ 19వ ఏట ప్రారంభించిన ఈ స్టార్టప్ పది నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరి అనే కాన్సెప్ట్ తో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇది భారత దేశపు అతి పెద్ద క్విక్ కామర్స్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగి ఐపీఓ దిశగా దూసుకెళ్తోంది.
తిలక్ మెహతా అనే యువకుడు తన పదమూడో ఏట ముంబై డబ్బా వాలాల సాయంతో ప్రారంభించిన కొరియర్ సర్వీస్.. పేపర్స్ అండ్ పార్శిల్స్.. ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అంతరిక్షంలోనూ సత్తా చాటిన భారతీయ స్టార్టప్స్. స్కై రూట్ అనే సంస్థను పవన్ కుమార్ చందన, భరత్ దాకా అనే ఇద్దరు స్థాపించారు. ఈ సంస్థ ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రారంభించిన తొలి స్పేస్ స్టార్టప్. అలాగే.. అగ్నికుల్ కాస్మోస్ అని శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్ ఎస్పీఎం ప్రారంభించిన ఈ స్టార్టప్ త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్లను తయారు చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దిగంతర. అనిరుధ్ శర్మ, రాహుల్ రావత్.. తమ విద్యార్ధి దశలోనే ప్రారంభించిన ఈ సంస్థ అంతరిక్ష వ్యర్ధాలను ట్రాక్ చేసే స్పేస్ గూగుల్ మ్యాప్స్ లాంటి సాంకేతికతను ఇంప్రూవ్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ విభాగంలో సర్వం ఏఐ స్థాపించారు వివేక్ రాఘవన్. భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా ఏఐ మోడళ్లను రూపొందిస్తోందీ సంస్థ. ఇక అనిరుధ్ మిశ్రా స్థాపించిన ఆగస్ట్ ఏఐ అనే స్టార్టప్ డిజిటల్ హెల్త్ కేర్ రంగంలో ఏఐ ద్వారా విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఓలా ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ కృట్రిమ్ అనే స్టార్టప్ పెట్టగా ఇది భారతదేశపు సొంత ఏఐ మోడల్ ని తయారు చేస్తోంది. ఇక ఫిన్ టెక్ రంగానికి వస్తే.. రాజోర్ పే- హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ స్థాపించిన సంస్థ ఇప్పుడు భారత్ డిజిటల్ పేమెంట్స్ లో వెన్నుముకగా నిలుస్తోంది. ఫిజిక్స్ వాలా- అలక్ పాండే ప్రారంభించిన ఈ ఎడ్ టెక్ స్టార్టప్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తూ.. లాభాల్లో ఉన్న యూనికార్న్ గా నిలుస్తోంది. ఓయో రూమ్స్ రితీష్ అగర్వాత్ అతి చిన్న వయస్సులోనే హోటల్ పరిశ్రమలో సరికొత్త విప్లవం సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా తన బ్రాండ్ విస్తరించారు.
పైసామే ఆటో బీమా.. రేష్మిత సర్వేపల్లి, జయరామ్ సర్వేపల్లి అనే ఇద్దరు అక్కా తమ్ముళ్లు.. స్థాపించబోయే ఈ ఇన్ స్యూరెన్స్ స్టార్టప్ ఎలాంటిదంటే.. ఒక కస్టమర్ ఏ వస్తువు కొన్నా అందులోంచి ఒక శాతం మొత్తం తీసి.. దాన్నే అతడి జీవిత బీమా ఖాతాలో జమ చేసి.. వారి మరణానంతరం వారి కుటుంబానికి అంద జేయాలనుకుంటున్నారు. స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.



.webp)


