Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంధన భద్రతే లక్ష్యంగా భారత్ అడుగులు.. గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక దౌత్యం
posted on: Apr 24, 2026 5:35PM

చమురు సరఫరా ఆగకూడదు, దేశ ఆర్థిక వ్యవస్థ వెనకడుగు వేయకూడదు అన్న లక్ష్యంతో భారత్ గల్ఫ్ తో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రియాద్ పర్యటన, కేంద్ర మంత్రి జైశంకర్ యూఏఈ చర్చలు, మరో కేందర్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ సందర్శన ఇవన్నీ ఎనర్జీ సెక్యూరిటీ లక్ష్యంగా సాగినవే.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే.. షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా, నిర్బంధం లేకుండా కొనసాగాలని కోరుతోంది. భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ లో అరవై శాతానికి పైగా గల్ఫ్ ప్రాంతంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఇండియా గల్ఫ్ దేశాలతో దౌత్యం నెరపుతోంది.
ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల అంటే ఈ నెల 19న సౌదీ రాజధాని రియాద్ లో పర్యటించారు. అక్కడ ఆయన ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ జీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, అలాగే ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు, ముసాయిద్ అల్–ఐబాన్ తో వరుస భేటీలు జరిపారు. , ఈ చర్చల్లో.. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ప్రాంతీయపరిస్థితులు, ఇంధన సహకారం, సముద్ర రవాణా భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఇండియాకు టాప్ మూడు చమురు సరఫరా దేశాలలో రష్యా, ఇరాక్ తో పాటు సౌదీ కూడా ఉంది. అంతే కాకుండా సౌదీలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. ఇటీవల సౌదీ, పాక్ రక్షణ ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతా సమీకరణాలు, ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో.. రియాద్ తో నిరంతర, నేరుగా, ఉన్నత స్థాయి సంభాషణ భారత్ కు అత్యవసరం. చమురు ధరలు, సరఫరా, షిప్పింగ్ భద్రత వీటిపై సౌదీ ఉన్నత స్ధాయి వర్గాలతో అజిత్ దోవల్ జరిపిన చర్చలు సానుకూలంగా సాగినట్లు భారత దౌత్యవర్గాల సమాచారం.
అజిత్ దోవల్ సౌదీ పర్యటనకు ముందు. ఈ రెండు పర్యటనలకూ ముందు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈలో పర్యటించారు. జైశంకర్ యూఏపీ పర్యటన కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే.. ఎందుకంటే.. యూఏఈ ఇండియాకు ముఖ్య వాణిజ్య భాగస్వామి. పెట్టుబడులు, మౌలిక వసతులు, డిజిటల్, ఫైనాన్షిల్ రంగాలలో ఇరు దేశాల మధ్యా కీలక భాగస్వామ్యం ఉంది.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన కూడా ఇందులో భాగంగానే జరిగింది. ఎందుకంటే ఖతార్.. ఇండియాకు ఎల్ఎన్జీ, ఎల్పీజీ ప్రధాన సరఫరాదారు. దీర్ఘకాల గ్యాస్ ఒప్పందాలు, ధర స్థిరీకరణ, షిప్పింగ్ భద్రత ఇవన్నీ నేరుగా భారత విద్యుత్, పరిశ్రమ, గృహ వినియోగంపై ప్రభావం చూపే అంశాలు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో సౌదీ, యూఏఈ, ఖతార్ దిశగా జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు భారత్ భారత్ వ్యూహాత్మక దౌత్య అడుగులుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఇండియా ఇప్పుడు విస్పష్టంగా ఇంధన అవసరాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుంగా వివిధ సరఫరాదారులతో దీర్ఘకాలిక, స్థిరమైన ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా కదులుతోంది.
పశ్చిమ ఆసియాలో ఎవరి రాజకీయ మార్గం ఎలా ఉన్నా.. ఇండియా మాత్రం ఇంధన భద్రత, జాతీయ భద్రత లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే దోవన్ సౌదీ నాయకత్వంతో జరిపిన చర్చలలో.. సముద్ర రవాణా భద్రత, నిర్బంధం లేకుండా వాణిజ్య నౌకల సాఫీ ప్రయాణం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లేదా నియంత్రించే దౌత్య మార్గాలు వంటి అంశాలపై ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సేకరణ, సంకలనం: సీతారాం కంఠంనేని
References
• Hindustan Times – NSA Ajit Doval visits Saudi Arabia in outreach to key energy suppliers Hindustan Times
• Zee News – NSA Ajit Doval visits Saudi Arabia as part of India’s outreach to key energy suppliers Zee News
• GNN / NewsAge – India’s push to engage key energy suppliers amid Strait of Hormuz closure gnn.asia news-age.com
• State Correspondents – MEA terms Doval’s Riyadh visit “helpful & strategic” amid West Asia crisis statecorrespondents.com






