భారత్-పాక్ మ్యాచ్...అభిమానులకు గుడ్ న్యూస్

posted on: Feb 15, 2026 4:56PM

 

టీ20 ప్రపంచకప్‌లో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా  రాత్రి 7 గంటలకు భారత్-పాకిస్థాన్ మధ్య సమరం జరగనుంది. మ్యాచ్ వర్షం ముప్పు తొలిగినట్లేనని తెలుస్తోంది. మబ్బులు వీడి, ఆకాశం ప్రశాతంగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. పిచ్ సిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో భారత్ కుల్ధీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ తిరిగి రావటంతో సంజూ శాంసన్ బెంచ్‌కి పరిమితం కావచ్చు. పాక్‌లో బాబర్ స్థానంలో, గత మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్‌కు అవకాశం ఉంది. జమాన్‌కు టీ20  ఫార్మాట్‌లో బాబర్ అజామ్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ ఉంది. 

ఈ మ్యాచ్‌పై అధికార, విపక్ష పార్టీల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ, దాని మిత్రపక్షాలు ధీమా వ్యక్తం చేస్తుండగా, సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో పాకిస్థాన్‌తో అసలు మ్యాచ్ ఆడటమేంటని కాంగ్రెస్ తీవ్రంగా ప్రశ్నిస్తోంది.యుద్ధభూమిలో దాయాదులను ఓడించాం, ఇప్పుడు క్రికెట్ మైదానంలోనూ మన జట్టు పాక్‌ను చిత్తు చేస్తుంది. ప్రతి విషయంలో భారత్ గొప్పదని నిరూపిస్తాం" అని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అన్నారు. ఇదే అభిప్రాయాన్ని లఢక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా, బీజేపీ నేత రవీంద్ర రైనా కూడా వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠతో ముడిపడిన ఆటలో భారత్ గెలవాలని ఆకాంక్షించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...