Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇస్తుందా?
posted on: Feb 14, 2026 6:21PM

ఆసియా కప్ 2025 టోర్నీ నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య కరచాలన వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా ప్లేయర్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలానే ఆసియా కప్-2025 ట్రోఫీని సైతం ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి షేక్ హ్యాండ్ అంశం తెరపైకి వచ్చింది.
భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? అంటూ ఎదురైన ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా సమాధానం ఇచ్చాడు. టీమిండియాతో పోరు సందర్భంగా శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ అఘా పాల్గొన్నాడు. ఐసీసీ టోర్నీల్లో ఒకటైన ప్రపంచ కప్ లో మాకు భారత్‌పై మంచి రికార్డు లేదు. గతాన్ని తాము మార్చలేమన్నాడు. టీమిండియా ప్లేయర్లను కరచలనం అడుగుతారా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. రేపు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చాడు.
'టీమిండియా ప్లేయర్లతో కరచాలనం గురించి ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాడు. వారు ఇస్తే తప్పకుండా మేమూ షేక్ హ్యాండ్ ఇస్తాం. ఏం జరుగుతుందో రేపు చూద్దామన్నాడు . భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని మ్యాచ్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని మేమూ కోరుకుంటాం. టాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఫలితాన్ని అది నిర్ణయించదు. ఎవరు బాగా ఆడితే వారే విజయం సాధిస్తారని సల్మాన్ తెలిపాడు.






