Latest News

ఇది దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు

posted on: Feb 26, 2019 2:23PM

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. ఢిల్లీలో అత్యున్న స్థాయి సమావేశం తర్వాత మోదీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. మోడీ వేదిక వద్దకు రాగానే ప్రజలు పెద్ద ఎత్తున ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ఇది దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు అన్నారు. మన దేశంపై శత్రువు కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ధి చెబుతామన్నారు. జై జవాన్‌, జై కిసాన్‌ అనేది మా నినాదమని చెప్పారు. రెండు రోజుల క్రితం దేశ చరిత్రలోనే తొలిసారిగా మహత్తర పథకం ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధులు జమ చేస్తామని చెప్పారు. కేంద్రం ఇలాంటి సాయం చేయడం దేశ చరిత్రలో తొలిసారి అని చెప్పారు. ‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ భారతావని తల ఎత్తుకునే ఉంటుంది. ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. జాతి ప్రయాణం ఆగదు.. ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పదనే భావనతో పనిచేస్తున్నాం. ఓఆర్‌ఓపీ కింద మాజీ సైనికులకు రూ.35వేల కోట్లు అందించాం’ అని మోదీ అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...