అమెరికా భారత్ వైపే...

posted on: Jul 25, 2017 4:23PM

 

భారత్, చైనా మధ్య ప్రస్తుతం వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో పనిచేసిన కీలక అధికారి కూడా ఈ వార్ పై స్పందించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఏ విషయంలోనూ చైనాకు తీసిపోదని .. టెక్నాలజీ పరంగా భారత్ సాధిస్తున్న విజయాలు చైనా కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయని, అందుకే భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అంతేకాదు.. అమెరికా, భారత్‌ మధ్య బంధం చాలా దృఢంగా వుందని..దానికి నిదర్శనం భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించిన విధానమని ఆయన చెప్పారు. భారత్ కు ఎవరి సాయమూ అవసరమవుతుందని తాను భావించడం లేదని.. భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం అనివార్యమైన పక్షంలో అమెరికా, భారత్ పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...