Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భారత్ - ఎ టీమ్
posted on: Jun 17, 2026 7:45PM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 9 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
భారత్ జట్టులో ప్రియాంశ్ ఆర్య(58), కుమార్ కుషాగ్రా(58), తిలక్ వర్మ(59) హాఫ్ సెంచరీలు చేశారు. వైభవ్ సూర్యవంశీ(38), రుతురాజ్ గైక్వాడ్(30), విప్రాజ్ నిగమ్(30) పర్వాలేదనిపించారు. సూర్యాంశ్(7), అనుకుల్ రాయ్(4), అన్షుల్ కాంబోజ్(0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మానుల్లా 2, జహీర్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. బహిర్ షా(57), ఫైసల్ షినోజాదా(46), ఇమ్రాన్ మిర్(32) రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్-ఎ బౌలర్లలో నిశాంత్ సింధు 4 వికెట్లతో చెలరేగాడు. యశ్ ఠాకూర్ 2, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్, అనుకుల్ రాయ్ తలొక వికెట్ పడగొట్టారు.


.webp)



