Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్టీవ్ స్మిత్.. ఒక్కరోజులోనే తొమ్మిదిన్నర కోట్ల ఆదాయం.. ఎలాగంటే..?
posted on: Apr 1, 2026 9:22AM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. మైదానంలో పరుగుల వరద సృష్టించి రికార్డులు బ్రేక్ చేసే స్టీవ్ స్మిత్ వ్యాపారంలో కూడా అదే రీతిలో దూసుకెడుతున్నాడు. సరైన సమయంలోసరైన నిర్ణయం తీసుకుంటూ లాభాల పంట పండించుకుంటున్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్ తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం అతడికి ఒక్క రోజులోనే కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ఒక స్పోర్ట్స్ టెక్నాలజీ స్టార్టప్‌లో ఆయన చేసిన ఇన్వెస్ట్ మెంట్ విలువ అనూహ్యంగా పెరిగి.. కేవలం ఒకే ఒక్క రోజు లో స్మిత్ కు దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలను అతడి ఖాతాలో పడేలా చేసింది.
విషయమేంటంటే.. గతంలో స్మిత్ ఒక చిన్న స్పోర్ట్స్ అనలిటిక్స్ కంపెనీలో వాటాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన పెట్టిన పెట్టుబడి విలువ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తాజాగా ఆ కంపెనీ మార్కెట్ వాల్యూయేషన్ విపరీతంగా పెరిగింది. దానికి తోడు కొత్త ఒప్పందాల కారణంగా ఆ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఎగిసింది.
దీంతో స్మిత్ కొన్న షేర్ల వలువ అనేక రెట్లు పెరిగింది. స్టీవ్ స్మిత్ కంపెనీలో పెట్టిన షేర్ల విలువ ఒక్క రోజులోనే 1.2 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల మేర ఎగబాకింది. కొన్నేళ్ల కిందట 50 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ ప్రయాణం.. ఈ రోజు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల మార్కు దాటడం విశేషం. ఆస్ట్రేలియా క్రికెటర్లలో అత్యధిక నికర ఆస్తి కలిగిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు.
సాధారణంగా క్రీడాకారులు రియల్ ఎస్టేట్ లేదా హోటల్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మిత్ మాత్రం భవిష్యత్తు అవసరాలను గుర్తించి తెలివిగా టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేశాడు. అంతే కాకుండా సరైన కంపెనీని ఎంచుకోవడంతో ఆయన భారీగా లాభపడ్డారు.






