Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇమ్రాన్ ఖాన్ అప్పుడలా.. ఇప్పుడిలా!
posted on: Feb 13, 2026 9:00AM
.webp)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అదే పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులైతే అసలాయన బతికి ఉన్నారా? జైల్లోనే చంపేసి ఆ విషయం బయటపెట్టడం లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.
పాకిస్థాన్ జట్టును వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు.. అప్పట్లో అంటే ఆయన క్రికెట్ గా వెలుగొందుతున్న సమయంలో ఆయన స్టైలే వేరు. ఆయనకు దక్కిన గౌరవమే వేరు. జట్టు సభ్యులతో ఆయన ఫ్లైట్ లో ప్రయాణిస్తుంటూ.. ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఆడింది ఆట- పాడింది పాట అన్నట్లుగా ఉండేది. ఒక్క పాకిస్థాన్ మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు కూడా ఇమ్రాన్ స్టైల్ కి, బౌలింగ్ పేస్ కి ఫిదా అయ్యే వారు. ఇమ్రాన్ ఖాన్ కి పాక్ లోనే కాదు ప్రపంచ ఆటగాళ్లు కూడా అభిమానించేవారు. ఆరాధించేవారు.
ఆ తరువాత ఆయన రాజకీయరంగ ప్రవేశం చేశారు. పాకిస్థాన్ ప్రధాని కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఇమ్రాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇటీవల ఇమ్రాన్ పరిస్థితిని పరిశీలించేందుకు సుప్రీం పంపిన అమికస్ క్యూరికి ఇమ్రాన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. దాదాపు 80 శాతం కంటి చూపు కోల్పోయి, ఆరోగ్యం క్షీణించి తన పరిస్థితి అత్యంత దయనీకంగా ఉందని ఇమ్రాన్ అమికస్ క్యూరీకి చెప్పారు.
అప్పట్లో క్రికెట్ లో వెస్టిండీస్ ఆధిపత్యం తిరుగులేకుండా ఉండేది. 1983కు ముందు జరిగిన రెండు వన్డే వరల్డ్ కప్ టోర్నీలలోనూ విండీస్ విజేతగా నిలిచింది. క్రికెట్ లో ఆ దేశానికి ఎదురే లేదన్న పరిస్థితి ఉండేది. అలాంటి విండీస్ ఆధిపత్యాన్ని తొలుత 1983 వరల్డ్ కప్ లో భారత్ దెబ్బతీసింది. అప్పట్లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సారథి కపిల్ దేవ్. హర్యానా హరికేన్ గా అభిమానులు కపిల్ ను ఆరాధించేవారు. ఆ తరువాత సారిగా వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అ తరువాత 1992లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు వరల్ కప్ విజేతగా నిలిచింది. భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ఎంత ప్రశాంతంగా, ఉత్సామంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. తన లెజండరీ హోదాతో ఎందరో క్రికెటర్లను తయారు చేశారు.
ఆనాడే కాదు ఈనాడు కూడా ఒక స్టైలిష్ బౌలింగ్ యాక్షన్ కి ఆయననే కేరాఫ్ గా చెబుతారు. అయితే కపిల్ దేవ్ రాజకీయా జోలికి రాలేదు. అందుకు భిన్నంగా ఇమ్రాన్ ఖాన్ తన క్రికెట్ ఇమేజీతో పాలిటిక్స్ లోకి ఎంటరై ప్రధాని స్థాయి దాకా ఎదిగారు. అయితే అధికారం కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలలో చిక్కుకుని జైలు పాలై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇమ్రాన్ కు వైద్యం అందించే విషయంలో పాక్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆదేశించాల్సిన పరిస్థితి రావడాన్ని బట్టే జైల్లో ఇమ్రాన్ ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అవగతమౌతుంది.



.webp)


