Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బండి భగీధర్ కేసుపై తక్షణ చర్యలు.. డీజీపీకి సీఎం ఆదేశాలు
posted on: May 11, 2026 2:25PM

తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై ముఖ్యమంత్రి నేరు గా జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించు కుంది. కేసు నమోదై రోజులు గడిచినా ఆ కేసు పై చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం స్పందించింది.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ పై నమోదైన కేసుపై వెంటనే విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ ను ఆదేశించారు. ఈ నెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలే దని సీఎం రేవంత్ రెడ్డి సీవీ ఆనందర్ ను నిలదీశారు. కేసులో జాప్యంపై స్వయంగా సీఎం రాష్ట్ర డీజీపీని ప్రశ్నించడం విశేషం.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి వచ్చిందనీ, పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఆ బాధ్యతల్లో నిమగ్నమ య్యారని డిజిపి ఆనంద్ వివరించారు. ఈ కారణంగా కేసు దర్యాప్తులో కొంత ఆలస్యం జరిగిందని డిజిపి ముఖ్యమంత్రి కి తెలిపారు.
అయితే కేసు ప్రాముఖ్యత ను దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎలాంటి ఆలస్యం సహించ బోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందా లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేసులో నిజానిజాలు త్వరితగతిన వెలికితీయాలని, బాధ్యులపై చట్టప రమైన చర్యలు తీసుకోవా లని సూచించారు.
ప్రభుత్వం నేరాల విషయం లో రాజీ పడబోదనే సందేశం ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నేరుగా పర్యవే క్షణలోకి తీసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక బృందాల దర్యాప్తు ఎలా సాగుతుంది? కేసులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.


.webp)



