అక్రమ సంబంధం.. ప్రియుడి భార్య హత్య

posted on: Jan 31, 2026 3:36PM

అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని హరించిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. కేతేపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది.  కాగా నగేష్     మీసాల సుజాత అనే మహిళతో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాతకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.  అక్రమ సంబంధం విషయం నగేష్ భార్య మమతకు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నగేష్ ను తన వద్దనే ఉండిపోవాలని సుజాత్ ఒత్తిడి చేయడం, అందుకు నగేష్ అంగీకరించకపోవడంతో గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే.. సుజాత నగేష్ ఇంటికి వెళ్లి అతడి భార్య  మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో మమత అక్కడికక్కడే మరణించింది.

ఈ ఘటనలో మమత ఒడిలో ఉన్న ఆరు నెలల పసికందుకు తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. ఆ పసికందును ఆస్పత్రికి తరలించిన పోలీసులు సుజాతను అదుపులోనికి తీసుకున్నారు.  అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ సంబంధాల వల్ల కుటుం బాలు ఎలా నాశనం అవుతాయన్న విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టిందని స్థానికులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...