అమీర్ పేట్ హాస్టళ్లలో చీకటి దందాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి సెల్ఫీ వీడియో

posted on: May 21, 2026 11:14AM

హైదరాబాద్‌ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే వేలాది మంది యువతులకు అమీర్‌పేట్ ఒక ప్రధాన కేంద్రం. ఇక్కడి హాస్టల్స్ తమకు సురక్షితమైన ఆశ్రయాన్ని ఇస్తాయని నమ్మి ఎంతో మంది అమ్మాయిలు చేరుతుంటారు. అయితే..  తాజాగా అమీర్‌పేట్‌ లోని ఒక ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లేడీస్ హాస్టల్ ముసుగులో నిర్వాహకులు లోపల చీకటి దందాలు నడుపుతున్నారంటూ ఒక బాధితురాలు  బయటపెట్టిన నిజాలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సురక్షితంగా ఉంటుందనుకున్న వసతి గృహం, కొందరు స్వార్థపరుల వల్ల అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

తమ హాస్టల్‌ లో నిత్యం జరుగుతున్న దారుణాలను, నిబంధనల ఉల్లంఘనలను ఆ యువతి ఓ సెల్ఫీ వీడియో ద్వారా వివరించింది.  ఇతరుల గురించి చెప్పడమే కాకుండా..  స్వయంగా తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాలను కూడా ఆ సెల్ఫీవిడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  హాస్టల్ నిర్వాహకుల అండదండలు, సహకారంతోనే   ఇలాంటి అసాంఘిక పనులు, తప్పుడు దందాలు సాగుతున్నాయని ఆ యువతి ఆరోపించింది.  

హాస్టల్‌ లో జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాలపై తక్షణమే స్పందించి మాకు రక్షణ కల్పించాలని, చట్టవిరుద్ధమైన పనులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ అసాంఘిక కేంద్రంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాధితురాలు ఆ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులను కోరింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...