మోజు తీరింది..ముక్కలుగా నరికాడు
posted on: Apr 12, 2017 6:18PM

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాహేతరం సంబంధాలు పెట్టుకుని నిండు జీవితాలు బలి చేసుకున్న ఎన్నో సంఘటనలు మనం చూశాం. ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను లోబరుచుకోవడం..విషయం బయటపడుతుంది అనుకున్న సమయంలో అత్యంత దారుణంగా చంపి వారిని అడ్డు తొలగించుకున్న కేటుగాళ్ల కహానీలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన లావణ్యకు అదే గ్రామానికి చెందిన దండ్ల రాజుకి పెద్దలు వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే బతుకు దెరువు కోసం రాజు గల్ఫ్ వెళ్లాడు..
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములు అనే వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం వీరి బంధం బాగానే నడిచినప్పటికి కొద్దిరోజుల నుంచి రాజు, లావణ్యల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఆదివారం బహిర్భూమికి వెళ్లిన లావణ్యపై అత్యాచారం జరిపి..అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఒక సంచిలో తీసుకెళ్లి ఊరి చివర్లో ఉన్న కుంటలో పడేశాడు.
ఆమె ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తలో దిక్కుకు వెళ్లి వెతికారు. అయితే ఊరి చివర చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహాం ఉందని తెలియడంతో కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూశారు. కట్టుకున్న చీర, నగల్ని బట్టి లావణ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని డాగ్ స్వ్కాడ్ సాయంతో నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామ శివారు వరకు వెళ్లిన జాగిలాలు తిరిగి వెనక్కి వచ్చాయి. అయితే మృతురాలి మావయ్య ఫిర్యాదు మేరకు రాములుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.



.jpg)
.jpg)


.webp)


