Latest News

టి20 వరల్డ్ కప్.. ఐసీసీ డెడ్ లైన్ తో దిగొచ్చిన బంగ్లాదేశ్

posted on: Jan 22, 2026 8:25AM

టి20 వరల్డ్ కప్ లో భారత్ లో మ్యాచ్ లు ఆడేది లేదంటూ భీష్మించిన బంగ్లాదేశ్ దిగి వచ్చింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ లో తాము ఆడే  మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాలంటూ ఐసీసీని బంగ్లాదేశ్ కోరిన సంగతి తెలిసిందే.  ఇండియాలో  తమ ఆటగాళ్ల  భద్రతపై ఆందోళన ఉందంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.  

అయితే బంగ్లాదేశ్ విజ్ణప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.  కాగా తమ మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాలన్న బంగ్లా విజ్ణప్తికి పాకిస్థాన్ వినా మరే దేశమూ మద్దతు ఇవ్వలేదు. దీంతో ఐసీసీ భారత్‌లో ఆడే విషయంపై 24 గంటల్లోగా తుది నిర్ణయం చెప్పాలని బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా అంగీకారం తెలపకపోతే, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని స్పష్టం చేసింది.

దీంతో బంగ్లాదేశ్ దిగి వచ్చింది. భారత్ లో మ్యాచ్ లు ఆడే విషయంలో తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తెలిపేందుకు ఐసీపీ విధించిన డెడ్ లైన్ ను మరో 24 గంటలు పెంచాలని కోరింది.  బంగ్లాదేశ్, ఇండియాల మధ్య నెలకొన్న   ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే.   

google-ad-img
    Related Sigment News
    • Loading...