వెబ్ సైట్ యూజర్లను బెట్టింగ్ యాప్ లకు మళ్లించాడు!
posted on Nov 19, 2025 8:39AM
.webp)
ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లతో సినిమాలను పైరసీ చేసిన రవి.. ఆ వెబ్ సైట్ ల యూజర్లను బెట్టింగ్ యాప్ లకు మళ్లించాడు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు డొమైన్లను క్రియేట్ చేశాడు. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్ పేట్ లో, మరోటి అమెరికాలోనూ రిజిస్టర్ అయి ఉన్నాయి. రవి Tradersin.com, Makeindiashop.shop అనే డొమైన్లు వాడి 1win, 1xbet వంటి బెట్టింగ్యాప్స్ప్రమోట్చేశాడు. ఈ సంచలన విషయాలన్నీ ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ రెండు డొమైన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి డబ్బు వచ్చిందనీ, ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్సైతం జరిగినట్టు రవి అ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఐబొమ్మ నుంచి బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడనీ, యూజర్ ఐబొమ్మలో మూవీ చూస్తూ ఉంటే.. పక్కనే పాప్ -అప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింకులు కనిపించేవని, ఆ లింక్ ను యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ రవికి కమీషన్ వచ్చేదని తెలిపారు.
అయితే.. ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెప్తున్నారు. పోలీసులు ఈ డొమైన్ల ట్రాఫిక్‌ను ట్రాక్ చేసి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌తో రవిని పట్టుకున్నారు. రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్సైట్స్మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడనీ, ఇది ఆగాలంటే రవిని రిమాండ్‌కు తీసుకోవడం అవసరమనీ పోలీసులు పేర్కొన్నారు.
పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే ఐపీ, ఒకే ఈ–మెయిల్, ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ అయినట్టుగా గుర్తించారు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్‌ను ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి స్వయంగా చూసుకునేవాడని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను తో పాటుగా ఓటిటి వచ్చే కంటెంట్ మొత్తాన్ని కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రవిని గుర్తించడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ కీలక పాత్ర పోషించినట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.
విదేశీ పౌరసత్వం పొందడమే అతని క్రిమినల్ ఉద్దేశ్యాన్ని సూచిస్తోందని, దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు తీవ్ర ప్రమాదమని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.