ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్

posted on: Nov 15, 2025 9:19AM

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు  ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు.  తన ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా  సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిన రవిపై పలువురు తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల యవ్వారలన్నీ బయటపెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకే సవాల్ చేసి బెదరించే స్థాయికి వెళ్లాడు. అప్పటి నుంచీ రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండంటూ రవి పోలీసులకు సవాల్ కూడా విసిరాడు.  ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాలోని  రూ. 3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.  కాగా రవి శుక్రవారం (నవంబర్ 14) హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...