హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

posted on: Jun 27, 2026 11:57AM

 

మేడ్చల్–మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టి కబ్జాదారులకు షాక్ ఇచ్చింది. కోట్ల రూపా యల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వేసిన ఎత్తుగడలను భగ్నం చేస్తూ అధికారులు రంగం లోకి దిగారు. హస్మత్‌పేట సర్వే నంబర్–01లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 98 ఎకరాలు ఆక్రమణలకు గురై ఇళ్ల నిర్మాణాలు జరిగిపోయాయి. ఇప్పటికే నివా సాలు ఉన్న ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇంకా మిగిలి ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనే హైడ్రా తన చర్యలను కేంద్రీకరించింది.

ఈ 10 ఎకరాలను కూడా ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు నిర్మించి, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి, తమ అనుచరులతో కాపలా పెట్టించినట్లు అధికారులు గుర్తించారు. అయితే రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు, రెవెన్యూ అధికారుల సమక్షంలో, భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా రంగంలోకి దిగి, ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

అధికారుల అంచనా ప్రకారం, రక్షించిన ఈ 10 ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లు. ఇప్పటికే దాదాపు మొత్తం భూమి ఆక్రమణకు గురైన నేపథ్యంలో, మిగిలిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా వేగంగా స్పందిం చడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎలాంటి రాజీ ఉండదనే సంకేతాలను ఈ ఆపరేషన్ మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ఇదే తరహా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...