Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి..!
posted on: Jul 16, 2026 8:57PM
.webp)
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువకుడిపై జరిగిన దారుణ కత్తి దాడి తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్‌గా మారి చెక్కర్లు కొడుతున్నారు.. హైదరాబాద్‌లోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన సయ్యద్ సోహైల్ అమెరికాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఓ అమెరికన్ వ్యక్తి సోహైల్ వద్దకు వచ్చి ముందుగా "నువ్వు ముస్లిమేనా?" అని ప్రశ్నించాడు. అనంతరం ఎలాంటి వాగ్వాదం లేదా రెచ్చగొట్టే పరిస్థితి లేకుండానే ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడిలో సోహైల్‌కు శరీరంలోని వివిధ భాగాల్లో సుమారు 15 కత్తిపోట్లు తగిలినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయనను అక్కడున్న పలువురు వెంటనే రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.
ప్రాథమిక విచారణలో ఈ దాడి పూర్తిగా మత విద్వేషం కారణంగానే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని లక్ష్యంగా చేసుకుని అతని మతాన్ని ప్రశ్నించిన తర్వాత దాడికి పాల్పడటం వల్ల, ఈ కేసును హేట్ క్రైమ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ప్రస్తుతం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక ద్వేష నేరం కింద అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడిపై నిందితుడు విచక్షణారహి తంగా కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ సంఘాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరుతున్నాయి. అమెరికాలో ఇటీవలి కాలంలో జాతి, మత విద్వేషంతో జరిగే దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి భారతీయులతో పాటు ఇతర వలసదారుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Hyderabad youth attacked with knife in America, Syed Sohail,Religious hatred, America, Donald Trump



.webp)


