షూస్ వేసుకుని బతుకమ్మ ఆడారు... దారుణం...
posted on: Sep 25, 2014 9:44AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో కొంతమంది తెలంగాణ నాయకులు బూట్లతోనే బతుకమ్మ ఆడటాన్ని తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా తెలంగాణ మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, ఇతర నాయకులు దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి, విఠల్ షూస్ వేసుకునే బతుకమ్మ ఆడారు. ఈ నాయకులలో ఒకరు కాకపోతే ఒకరైనా బతుకమ్మ దగ్గర షూస్ విప్పాలన్న కనీస మర్యాద లేకుండా అందరూ షూస్ వేసుకునే బతుకమ్మ ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ వున్న మహిళలు, ఇతర ఉద్యోగులు ఈ నాయకులు షూస్ వేసుకుని బతుకమ్మ ఆడటాన్ని గమనించినప్పటికీ ఆ విషయం వారికి చెబితే ‘ఫీలవుతారేమో’ అని మిన్నకుండిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, గౌరవ మర్యాదలతో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా బూట్లు వేసుకుని బతకమ్మ ఆడటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన సదరు నాయకులకు బతుకమ్మ మీద వున్న గౌరవానికి అద్దం పడుతోందని అంటున్నారు. షూస్ వేసుకుని బతుకమ్మ ఆడిన నాయకులు తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, చెప్పుల్లేకుండా బతుకమ్మ ముందుకు వచ్చి చెంపలు వేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.



.jpg)
.jpg)

.webp)



