Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'జల'దరింపజేస్తోన్న హైద్రాబాదర్ రో్డ్లు!
posted on: Sep 21, 2016 1:44PM
.jpg)
హైదరాబాద్ .... హైరానాబాద్ అయిపోయింది! కారణం ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురుస్తున్న వర్షమే! నిజానికి వాన పడగానే హైద్రాబాద్ వాసులు నరకం చూడటం ఇప్పుడు కొత్తేం కాదు. ఎన్నో దశబ్దాలుగా ఇదే కథ నడుస్తోంది. చినుకు పడితే వణికిపోవటం మామూలైపోయింది. కాని, ఈ సారి పరిస్తితి మరీ దారుణంగా వుంది...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ స్పెషల్ అటెన్షన్ పెట్టారు విశ్వనగరంపై. ఆయన నోటి వెంట బంగారు తెలంగాణ ఎన్నిసార్లు వచ్చిందో... అన్ని సార్లు హైద్రాబాద్ విశ్వనగరం అనే మాట కూడా వచ్చింది. హైద్రాబాద్లో స్కై స్కేపర్లు మొదలు స్కై వేస్ వరకూ బోలెడు నిర్మిస్తాం, నగరం రూపు రేఖలే మార్చేస్తామని పదే పదే ప్రకటించారు. కాని, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం కురుస్తోన్న వర్షాలు నిజమైన హైద్రాబాద్ ని ప్రతీ రోజు సాయంత్రం కళ్ల ముందు నిలుపుతున్నాయి.
హైద్రాబాద్ రోడ్లు బాగా లేవన్న విషయాన్ని ఊరికే మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శగా తీసుకోకూడదు ప్రభుత్వం. సిటీపై దృష్టి పెట్టిన కేటీఆరే స్వయంగా అంగీకరిస్తున్నారు రోడ్లపై వున్న అద్వాన్న పరిస్థితిని! వర్షం కారణంగా రోడ్లు కొట్టుకుపోవటమే కాదు... వాట్ని మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయకపోవటం సమస్యకి అసలు కారణం. వర్షం వల్ల లోతైన గుంతలు ఏర్పడ్డాక అవ్వి పూడుస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. పూర్తి స్థాయి మంచి రోడ్లు వర్షాలు తగ్గాక వేసే ఆలోచన వున్నా అప్పటి వరకూ రిపేర్లన్నా చేయాలి. కాని, జీహెచ్ ఎంసీ ఆ పనులు చేస్తున్నట్టు కనిపించటం లేదు....
గత కొన్ని రోజులుగా వర్షం ప్రతీ సాయంత్రం చల్లగా పలకరిస్తోంది. కాని, హైద్రాబాదీలకు వాన చల్లదనం కన్నా ట్రాఫిక్ వేడి మంట పుట్టిస్తోంది. వాన పడ్డాక ఒకవైపు గతుకుల రోడ్లు, మరో వైపు బతుకు దుర్బరం చేసే ట్రాపిక్ జామ్లు బెంబేలెత్తిస్తున్నాయి. దీనిపై గవర్నమెంట్ అర్జెంట్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే, వర్షం వల్ల, వరద వల్ల హైద్రాబాద్ లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుంటాయి. వాట్ని అమాంతం బాగు చేసేయటం కుదరకపోవచ్చు. కాని, అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగస్తులకి ఎంతో కీలకమైన రోడ్లు, వాటిపై రాకపోకలు నిర్లక్ష్యం చేయటానికి వీలు లేని అంశం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా రహదారులపై చూపు సారించాలి. లేకుంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ వానా కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. అంతకంటే మించి బ్రాండ్ హైద్రాబాద్ పై కూడా గుంతలు పడ్డ రోడ్లు దారుణమైన ప్రభావం చూపే ఛాన్స్ వుంది...


.jpg)



