Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలోనే నంబర్ వన్ హైదరాబాద్!
posted on: Apr 1, 2026 9:38AM

విశ్వనగరం భాగ్యనగరం దేశంలోనే అత్యంత అనుకూల నివాసనగరంగా ఖ్యాతి దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలన్నిటినీ వెనక్కి నెట్టి, అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రముఖ సంస్థ తాజాగా విడుదల చేసిన వి ఆర్ సిటీ - 2026' నివేదిక మేరకు దేశంలో అత్యంత అనుకూల నివాసనగరంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
పర్యావరణం, జీవన ప్రమాణాలు, ఆర్థిక వృద్ధి కారణంగా విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల ప్రాతిపదికగా ఈ నివేదిక రూపొందింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణతో పాటు స్టార్టప్‌లకు కేంద్రంగా మారడం నగర రూపురేకలను మార్చేసింది. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతులు ప్రజల జీవనశైలిని మెరుగుపరిచాయని వీఆర్ సిటీ 2026 నివేదిక పేర్కొంది
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నివసించడానికి అయ్యే ఖర్చు సామాన్యులకు అందుబాటులో ఉండటం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం కూడా ఈ నగరం అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరంగా నిలవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక పోతే ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు విస్తరణ, లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ ను అత్యంత అనుకూల నివాసయోగ్య నగరంగా మార్చాయి.
అలాగే నగరం ఇప్పటికే ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గుర్తింపు పొందింది. పర్యావరణ పరిరక్షణలోనూ ముందుంది. గాలి నాణ్యత విషయంలోనూ ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది. ఇక పోతే విద్య, వైద్య రంగాల్లో హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వెరసి హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా హైదరాబాద్ మహానగరానికి ఈ గుర్తింపు రావడం వరుసగా ఇది ఆరోసారి. ఈ గుర్తింపుతో హైదరాబాద్ కు విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






