హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో మార్పు

 

హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ఈనెల 3వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ మెట్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu