Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐటీ కారిడార్‌లో నో పార్కింగ్.. పట్టుబడితే ₹1000 ఫైన్!
posted on: Jun 15, 2026 10:44AM

హైదరాబాద్ ఐటీ హబ్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రధాన ఏరియాల్లో పీక్ అవర్స్‌లో రోడ్డు మీదకు రావాలంటేనే వాహనదారులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో, మళ్లీ సాయంత్రం ఇళ్లకు తిరిగొచ్చే వేళల్లో ఐటీ కారిడార్ రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ గందరగోళ పరిస్థితిని గమనించిన సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి మరియు రోడ్లను క్లియర్ చేయడానికి ఒక పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నారు.
ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ప్రయాణించే మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, కాపిటాలాండ్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పీక్ అవర్స్‌లో ఊపిరాడకుండా పోతున్నాయి. డెలాయిట్ డ్రైవ్, సైబర్ గేట్‌వే, మైండ్ స్పేస్ రోటరీల దగ్గర ఆఫీస్ క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాలు ఉద్యోగులను పిక్ అప్ మరియు డ్రాప్ చేయడానికి రోడ్డు మీదే ఆపేస్తున్నారు. దీనివల్ల వెనుక వచ్చే వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. యాప్ బేస్డ్ క్యాబ్ డ్రైవర్లు రైడ్స్ కోసం రోడ్డు పక్కనే గంటల కొద్దీ వాహనాలు పార్క్ చేసి ఉంచుతున్నారు. నిలోఫర్ కేఫ్ నుంచి ఐకియా దగ్గరున్న ఇండియన్ ఆయిల్ బంక్ వరకు, అలాగే ఐటీసీ కోహినూర్ రోడ్డులో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.
ఈ సమస్యపై రాయదుర్గం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పవన్ మయాస కీలక వివరాలు వెల్లడించారు. చాలా ఐటీ కంపెనీల లోపల వాహనాల పార్కింగ్, పిక్ అప్ కోసం బోలెడంత స్థలం ఉన్నప్పటికీ, ఆ లోపలి స్పేస్‌ను సరిగ్గా వాడకుండా వాహనాలను బయట రోడ్ల మీదే ఆపుతున్నట్లు గుర్తించారు. అందుకే పోలీసులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ కంపెనీల వల్లైతే బయట ట్రాఫిక్ జామ్ అవుతుందో.. ఆయా ఐటీ సంస్థలకు త్వరలోనే అధికారికంగా నోటీసులు ఇవ్వనున్నారు. తమ ఉద్యోగుల రవాణా వల్ల సాధారణ ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా కంపెనీలే సొంతంగా బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేయనున్నారు.
మరోవైపు, పోలీసులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా వీకెండ్స్ అయిన శుక్ర, శనివారాల్లో రోడ్డు పక్కన ఇష్టమొచ్చినట్టు పార్క్ చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నో పార్కింగ్ జోన్లలో ఉన్న వాహనాలను టోయింగ్ వాహనాల ద్వారా స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించి తప్పుగా పార్క్ చేసినందుకు గానూ వాహనదారులకు ₹1,000 చొప్పున భారీ జరిమానా విధిస్తున్నారు. దాంతో పాటు పాత చలాన్లు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా అక్కడికక్కడే వసూలు చేస్తున్నారు.
రోడ్ల మీద వాహనాలు నిలపకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క్వాల్కమ్ క్యాంపస్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక డెడికేటెడ్ పెయిడ్ పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం TGIIC అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఇతర బిజినెస్ స్టేక్‌హోల్డర్స్‌తో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఈ ట్రాఫిక్ తలనొప్పులకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులు కూడా వీలైనంత వరకు సొంత వాహనాలను పక్కన పెట్టి, మెట్రో రైల్ లేదా బస్సుల వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.


.webp)
.webp)


