Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జూనియర్ కాలేజీల పేరుతో ‘అగ్ని’ ఆట..!
posted on: Aug 6, 2026 7:54PM
.webp)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్గిపెట్టెలను తలపించే ఇరుకైన భవనాల్లో జూనియర్ కాలేజీల నిర్వహణపై తాజాగా అనేక ప్రశ్నలు తలెత్తు తున్నాయి. ఐదు అంత స్తుల భవనాల్లో కాలేజీల ను నిర్వహిస్తూ.. కనీస భద్రతా ప్రమాణాలను కూడా పాటించని పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని భవనాలకు ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో వందలాది మంది విద్యార్థులు బయటకు రావడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని జూనియర్ కాలేజీలు అత్యంత ఇరుకైన సందుల్లో కొనసాగు తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్ ఘటనాస్థలికి చేరుకోవడానికి కూడా అవకాశం లేని ప్రదేశాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, మెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అవసరమైన ఫైర్ ఎన్వోసీ పొందాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కాలేజీలకు సంబంధిత అనుమతులు నిరాకరించబడ్డాయి. అయినప్పటికీ ఆయా కాలేజీలు యథావిధిగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సంబంధిత అనుమతులు లేకుండానే నకిలీ పత్రాలను సృష్టించి బోర్డు అనుమతుల కోసం సమర్పించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంలో మరో సంచలన ఆరోపణ తెరపైకి వస్తోంది. సంబంధిత అధికారిక ప్రక్రియను పూర్తి చేయకుండానే 6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తే ఫైర్ ఎన్వోసీ ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు, దళారులు కాలేజీ యాజమాన్యాలను సంప్రదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఒక్క కాలేజీకి, ఇద్దరు వ్యక్తులకు పరిమితం కాకుండా పెద్ద నెట్‌వర్క్ వెనుక ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ ఫైర్ ఎన్వోసీలు తయారు చేసి ఇస్తున్న ముఠా కోసం ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ పత్రాలు ఎక్కడ తయారవుతున్నా యి? వాటిని ఎవరు సృష్టిస్తున్నారు? కాలేజీ యాజమాన్యాలకు వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని జూనియర్ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలపై జరుగుతున్న తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 142 కాలేజీలను పరిశీలించగా.. 52 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించి నట్లు గుర్తించారు. నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించి నట్లు గుర్తించిన కాలేజీల జాబితాను హైడ్రా పోలీసు లకు అందజేశారు.
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫైర్ శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలతో పాటు హైడ్రా కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు గా సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్రాలపై ఉన్న సంతకాలు, ఎన్‌ఓసీల వివరాలను సంబంధిత శాఖల రికార్డు లతో పోలీసులు సరిపో ల్చుతున్నట్లు సమాచారం. నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు పేర్కొన్న కాలేజీలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్‌ఓసీలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు తయారు చేశారు? సంబంధిత పత్రాలపై ఉన్న సంతకాలు నిజమైనవేనా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు
Hyderabad Inter College Forgery Case, Nagi Reddy, Fire Department NOC Scam, HYDRA Commissioner Ranganath, Telangana Inter Board Affiliation,Fake NOC Certificates, GHMC, Forgery






