Latest News

పిల్లి చేసిన పనికి ఓ యువతి ఆత్మహత్య

posted on: Mar 19, 2026 5:28PM

 

నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూరమవుతూ, భావోద్వేగ పరమైన బలహీనతలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ బంధాలు, స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపుడు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీ స్తోందనే ఆందోళన వ్యక్తమ వుతోంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌ పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) అనే యువతి  బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.  

గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చింది. ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి, కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలిం చినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.“పిల్లిని ఇంటికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరకు పిల్లి చనిపోవడంతో మా కుమార్తె కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది” అంటూ తల్లిదండ్రులు విలపించడం హృదయ విదారకంగా మారింది.

ఈ ఘటనతో మరోసారి సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, భావోద్వేగ అస్థిరతపై చర్చ మొదలైంది. పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయిన ప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థాయికి చేరితే ఇలాంటి దుర్ఘటనలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఎటువంటి ఘటనలు రెండు జరిగాయని నిపుణులు పేర్కొన్నారు... కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని, భావోద్వేగ పరమైన మద్దతు అందించాల్సిన అవసరం మరింతగా పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...