పోలీసు సైరన్‌తో వాహనం....వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన పోకిరీలు

posted on: Feb 15, 2026 11:55AM

 

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దారుణ మైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి దాదాపు కిలోమీటర్‌ మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో కొన్ని గంటల్లోనే పోలీసులు ఆ ఇద్దరూ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం సతీశ్‌ అనే వ్యక్తి ఆఫీస్ పనులు ముగించు కొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన మహేశ్‌, తరుణ్‌ అతడిని కారణం ఢీ కొట్టారు. అనంతరం సతీష్ పోకిరి యువకుల వాహనాన్ని ఫాలో అయ్యి అడ్డుకున్నాడు.. కారు దిగి సతీష్ మాట్లాడుతుండగా పోకిరి యువకులు ఆనందం అతన్ని ఢీ కొట్టి.... వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లడంతో సతీశ్‌ వాహనానికి చిక్కుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు గుర్తించారు. దాదాపు కిలోమీటర్‌ దూరం వరకు ఈ దారుణం కొనసాగింది. 

ఈ ఘటనలో సతీశ్‌కు తీవ్ర గాయాల య్యాయి. అతడి కాలు విరిగిపోవడంతో పాటు ప్రైవేట్‌ భాగాలకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్థానికులు స్పందించి అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఘటనపై సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి నిందితులు మహేశ్‌, తరుణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు “తెలంగాణ కన్స్యూ మర్‌ ఫోరం” పేరుతో తిరు గుతూ స్థానికంగా బెదిరింపు లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనతో కుషాయిగూడ ప్రాంతంలో భయాందోళనలు నెలకొ న్నాయి. ప్రజల మధ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్లపై దౌర్జన్యంగా వ్యవహరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. నిందితులపై హత్యాయత్నం తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీ సులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...