కాల్పులు జరగలేదు...పోలీసుల క్లారిటీ

 

హైదరాబాద్‌లో ఎటువంటి  కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయితి జరగిందని పేర్కొన్నారు. స్థలం విషయంలో  కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య మంగళవారం మణికొండలోని పంచవటి కాలనీలో ఘర్షణ జరిగింది. 

తనపై గన్‌ పెట్టి అల్లుడు అభిషేక్ గౌడ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అల్లుడు అభిషేక్‌పై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడే ఈ అభిషేక్ గౌడ్ కావడం విశేషం. 

ప్రస్తుతం ఈ కాల్పులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కేఈ ప్రభాకర్  కూతురుతో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడుతో14 ఏళ్ల క్రితం పెళ్లయింది, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ జంట ఒక సంవత్సరం నుండి విడివిడిగా నివసిస్తున్నారు. ఓ ఇంటి అగ్రిమెంట్ విషయంలో విభేదాలు వచ్చాయి ఈ ఘటన చోటుచేసుకుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu