Latest News
భార్యను ప్రియుడితో పంపేసి బతికిపోయాడు!
posted on: Mar 20, 2026 9:26AM
.webp)
ప్రియుడి సాయంతో భార్యలు కట్టుకున్న భర్తలను చంపేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఒక భర్త మాత్రం పంచాయతీ పెట్టి మరీ భార్యను ప్రియుడితో పంపేసి ప్రాణాలు కాపాడుకున్న సంఘటన తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. యూపీలోని బులందేశ్వర్ లో పోలీసుల సమక్షంలో జరిగిన ఈ విచిత్ర పంచాయతీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్య అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత ఏడాది పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో వెళ్లిపోయింది. నెల రోజుల పాటు తన ఆరు నెలల బిడ్డను భర్త దగ్గర వదిలేసి ప్రియుడితో ఉండిపోయింది. భార్యపై అనుమానం వచ్చిన రాజ్‌కుమార్ ఆమెను పలుమార్లు నిలదీశాడు. ఆమె మాత్రం తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెబుతూ వచ్చింది. ఓ రోజు ప్రియుడితో మాట్లాడుతుండగా రాజ్‌కుమార్ భార్య ఫోన్ లాక్కున్నాడు. ఫోన్‌ను చెక్ చేసి చూడగా.. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని మర్డర్ స్టోరీలు షేర్ చేసి ఉన్నాయి. సిమెంట్, డ్రమ్ స్టోరీ పేరిట ఆ మర్డర్ స్టోరీలు షేర్ చేసి ఉండటంతో రాజ్‌కుమార్ భయపడిపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ జరిగింది.
తాను రాజ్‌కుమార్‌తో ఉండనని, ప్రియుడితో వెళతానని ఆమె ఆ సందర్భంగా విస్పష్టంగా చెప్పడంతో రాజ్‌కుమార్ తన భార్యను ఆమె ప్రియుడికి అప్పగించేయడానికి అంగీకరించాడు. ఎందుకంటే గతంలో మీరట్ లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను సిమెంట్, డ్రమ్ స్టోరీ తరహాలో హత్య చేసిన సంఘటన జరిగింది. ఆ ఘటనలో ముస్తాన్ అనే మహిళ తన భర్త సౌరభ్ ను ప్రియుడి సహాయంతో హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ లో సిమెంట్ వేసి కప్పెట్టేసింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రాజ్ కుమార్ తన భార్య ఫోన్ లో డ్రమ్, సిమెంట్ స్టోరీ షేర్ అయి ఉండటంతో తనకూ అదే గతి పడుతుందని భయపడి భార్యను ప్రియుడితో పంపేశాడు.






