Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాయమైపోతున్నదమ్మో మానవత్వం..నడిరోడ్డుపై మహిళ మృతదేహం
posted on: Apr 14, 2026 9:58AM
.webp)
హైదరాబాద్ మెహదీపట్నంలో హృద యాన్ని కలిచివేసే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను అత్యంత వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ బస్సు కింద పడి పోయినప్పటికీ, డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
అయితే మానవత్వం మాయమైపోతోందా అనిపించేలా.. ప్రమాదం జరిగిన తర్వాత, మహిళ మృత దేహం నడిరోడ్డుపై పడివున్నప్పటికీ, ఎవరూ కనీసం ఆగలేదు. 108కు ఫోన్ చేయాలన్న ధ్యాస కూడా వచ్చినట్లు కనిపించలేదు. గంటల తరబడి ఆ మహిళ మృతదేహం అలాగే రోడ్డుపై పడి ఉంది.అటుగా వెడుతున్న వాహనాలు, పాదచారులు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియో ఆధారంగా మహిళను ఢీకొట్టి మృతికి కారణమైన బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.మతురాలి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.



.webp)


