శశిథరూర్ కుమారుడికి ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్
posted on: Feb 5, 2026 11:24AM

కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కు ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు ఉద్వాసన పలికింది. ఆ సంస్థ పెద్ద ఎత్తున లేఆఫ్ లకు తెరతీసింది. ఇందులో భాగంగా దాదాపు 300 మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలా తొలగించిన వారిలో జర్నలిస్టులు అధికంగా ఉన్నారు.
ముఖ్యంగా విదేశీ బ్యూరో, స్పోర్ట్స్, బిజినెస్ డెస్క్ లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మొత్తం జర్నలిస్టులలో మూడో వంతు కంటే ఎక్కువ మందికి వాషింగ్టన్ పోస్టు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కాగా వాషింగ్టన్ పోస్టు లేఆఫ్ లలో భాగంగా తనకు ఉద్వాసన పలికిన విషయాన్ని ఇషాన్ థరూర్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్టులో ఈ లేఫ్ లను గ్లోబల్ జర్నలిజానికి డార్క్ డేగా పేర్కొన్నారు. ఆ పోస్టుకు డెమొక్రసీ డైస్ ఇన్ డార్క్ నెస్ అనే పోస్టర్ ను జత చేశారు.






