తిరుపతి జిల్లాకు భారీ పెట్టుబడులు
posted on: Feb 20, 2026 9:31AM
.webp)
తిరుపతి జిల్లాకు మరో రూ.1,436కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం పేరిట నిర్మాణ రంగంలో రూ. 1,229కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ పెట్టుబడితో జిల్లాలో 1500ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. అలాగే ఇప్పటికే జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణలో భాగంగా రూ.209కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది.
ఈ పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. రెండు సంస్థల ప్రతిపాదనలకు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు రాయితీలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు కొత్తగా రూ.1,436కోట్ల పెట్టుబడులు, 1,535ఉద్యోగాలు రావడానికి అవకాశం ఏర్పడింది.






