నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

posted on: Mar 1, 2026 4:03PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో   భారీ పేలుడు సంభవించి 15 మంది మరణించారు. ఏపీలోని కాకినాడ జిల్లాలో భారీ పేలుడు ఘటనలో 24 మంది మృతిచెందిన .. ఘటన మరువక ముందే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ  ఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని కటోల్‌ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు,  పేలుడు పదార్థాలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఎస్బీఎల్‌లోని ఓ యూనిట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో 20 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు. ఈ ఘటనలో మరికొందరు  తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి ఈ పరిశ్రమ గోడౌన్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఉన్న  భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ గోడౌన్‌లో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని సమాచారం. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...