Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎల్బీనగర్‌లో భారీ పేలుడు
posted on: Feb 20, 2026 2:37PM

హైదరాబాద్‌లోని చట్నీస్ హొటల్‌లో భారీ పేలుడు సంభవించింది. హోటల్ కిచెన్‌లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కిచెన్ ప్రాంతం దెబ్బతిన్నట్లు సమాచారం. పేలుడు శబ్దం భారీగా వినిపించడంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.
కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టీమర్‌లో ఒత్తిడి పెరగడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


.webp)
.webp)


