Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి
posted on: Feb 28, 2026 2:44PM
.webp)
కాకినాడ జిల్లా సామర్ల కోట సమీపంలోని వేట్ల పాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 18 మంది మరణించారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేట్లపాలెంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం (ఫిబ్రవరి 28) ఈ పేలుడు సంభవించింది.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. వేట్లపాలెం గోదావరి కెనాల్ పక్కనే ఉన్న ఓ బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.



.webp)


