Latest News
బెంగళూరులో రెస్టారెంట్ల మూత.. ఎందుకంటే?
posted on: Mar 10, 2026 7:28AM

యుద్ధం ప్రభావం బెంగళూరుపై పడింది. బెంగళూరులో హోటల్స్ బంద్ అయ్యాయి. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సరఫరాను గ్యాస్ కంపెనీలు మూసివేయడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బెంగళూరు నగరంలో మంగళవారం (మార్చి 10) నుంచి నగర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లూ మూసివేస్తున్నట్లు బేంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇందుకు కారణమేంటంటే.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కమర్షియల్ వాడకానికి ఉపయోగించే ఎల్పీజీ సిలెండర్ల సరఫరా నిలిచిపోవడమే. హోటల్స్ కు గ్యాస్ పరఫరా పూర్తిగా నిలిచిపోయిన కారణంగానే తామీ నిర్ణయానికి వచ్చినట్లు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా 70 రోజుల వరకూ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన గ్యాస్ కంపెనీలు హఠాత్తుగా సరఫరాను నిలిపివేయడంతో గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నమని ప్రకటించింది.


.webp)
.webp)


