కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... న్యాయవాది మృతి

posted on: Apr 12, 2026 7:12AM

ఎన్టీఆర్ జిల్లాలోని  కీసర టోల్ ప్లాజా వద్ద ఈరోజు శనివారం (ఏప్రిల్ 11) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మరణించారు.  టోల్ ప్లాజా వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన  లారీ ఓ కారుపై బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఇన్‌కమింగ్ ప్రెసిడెంట్ ప్రభునాథ్ వాసిరెడ్డి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకుడు మాధవరావు నల్లూరి, న్యాయవాది రవితేజ పదిరి శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
శ్రీనివాస్ రావుకు ఒక కుమార్తె ఉన్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...