మొంథా తుపాన్.. కాకినాడ ‘హోప్’ ఐలాండ్

మొంథా తుపాన్ ప్రళయభీకర రూపం దాల్చి కాకినాడ తీరం వైపు దూసుకువస్తున్నది. ఈ తుపాను పెను విలయం సృష్టిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కాకినాడ వాసులు మాత్రం ‘హోప్’ ఐలాండ్ ఉండగా భయమేల అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 కాకినాడ తీరప్రాంతానికి కొద్ది దూరంగా బంగాళాఖాతంలో   టాడ్‌పోల్ ఆకారంలో ఉన్న ద్వీపమే ఈ హోప్ ఐలాండ్.   బంగాళాఖాతంలో 7 కిలోమీటర్ల దూరంలో  ఈ హోప్ ఐలాండ్ ఉంది. ఈ హోప్ ఐలాండ్ కారణంగానే  కాకినాడ    సహజ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. విశాఖకు డాల్ఫిన్స్ నోస్ కొండ ఎలాగో.. కాకినాడకు తుపానుల నుంచి సహజ రక్షణ కల్పించేదిగా ఈ హోప్ ఐలాండ్ ఉంది అని చెప్పవచ్చు.  ఇప్పుడు కాకినాడ వద్ద మొంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ హోప్ ఐలాండ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హోప్ ఐలాండ్ కారణంగా తుపాను బీభత్స ప్రభావం చాలా వరకూ తగ్గే అవకాశం ఉందని మత్స్యకారులు ధీమాగా చెబుతున్నారు. తుపానుల నుంచి హోప్ ఐలాండ్ కాకినాడకు రక్షగా నిలుస్తూ వచ్చిందనీ, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.  బంగాళాఖాతం నుండి వస్తున్న బలమైన తుఫానుల నుండి హోప్ ఐలాండ్  కాకినాడ నగరాన్ని కాపాడుతుంది. తుఫాను ఉప్పెనలు, వంటి వాటికి ఈ హోప్ ఐలండ్ సహజ అవరోధంగా, నియంత్రికగా పని చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.  సహజ అవరోధంగా హోప్ ఐలాండ్ (క్రచ్చులంక ) పనిచేస్తుంది. కా 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu