Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బండి బగీరథ్ లక్ష్యంగా హనీట్రాప్.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
posted on: May 9, 2026 3:30PM

ప్రేమ, పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని భారీగా డబ్బులు డిమాండ్ చేసిన హనీట్రాప్– ఎక్స్టార్షన్ కేసు కరీంనగర్‌లో సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి బగీరథను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడి భగీరథ్ ఇప్పటికే రూ.50 వేల రూపాయలు ఇచ్చిచారు. అయినప్పటికీ, అక్కడితో ఆగకుండా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసింది...యువతి తల్లి మరోసారి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వకపోతే యువతి ఆత్మహత్య చేసుకుంటుందని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి వయస్సును తప్పుడు విధంగా చూపిస్తూ మైనర్ కేసు పెడతామని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే మీడియా ద్వారా ప్రచారం చేస్తామని కూడా హెచ్చరించారు.
ఈ వ్యవహారం వెనుక పక్కా ప్రణాళికతో హనీట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నారని బండి బగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో యువతి కుటుంబ సభ్యుల పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ కేసు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితులపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న అమ్మాయి కూడా హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ కుమారుడు తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు... పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.... అదే సమయంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో యువతి, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు...


.webp)



