సెల్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటబోతే...

posted on: Jan 3, 2015 9:52AM

 

ఈ యువతరానికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని దుర్ఘటనలను చూసినా బుద్ధి రావడం లేదు. సెల్‌ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు కానీ, రైల్వే ట్రాకులను కూడా దాటడం ప్రమాదకరం అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితం... అడపాదడపా అందుకు విషాదాలను అనుభవించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం నాడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...