ఈడీ vs నౌహీరా షేక్ కేసులో సంచలన విషయాలు
posted on Oct 14, 2025 7:37PM

ఈడీ vs నౌ హీరా షేక్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ జప్తు ఆస్తులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద వ్యాపారవేత్త నౌ హీరా షేక్ మరియు ఈడి మధ్య కొనసాగు తున్న ఆస్తుల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను విక్రయిం చేందుకు నౌ హీరా షేక్ ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈడీ అనుమతి లేకుండా జప్తు ఆస్తులను విక్రయించి సుమారు 3 కోట్లు రాబట్టినట్లు ఆరోప ణలు ఉన్నాయి.
ఇక మరోవైపు, ఈడీ మాత్రం చట్టపరంగా జప్తు చేసిన 93 కోట్ల విలువైన ఆస్తులను వేలం ద్వారా విక్ర యిస్తోంది. అయితేవేలంలో పాల్గొం టున్న వ్యక్తులను నౌ హీరా బెదిరిస్తు న్నట్లు ఈడి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. అంతేకాక, ఆస్తుల విక్రయంలో ఒక సబ్ రిజిస్ట్రార్ కూడా నౌ హీరా షేక్‌కు సహకరించి నట్లు ఈడి ఆరోపణ ల్లో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈడీ పక్షాన కీలక ఆదేశాలు జారీ చేసింది.
నౌ హీరా షేక్‌ను విచారణ కోసం ఈడి ఎదుట హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదే శాలు జారీ చేసింది. అలాగే, విచారణకు హాజరు కాకుంటే వెంటనే అతని అరెస్టు చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఈడీ–నౌ హీరా మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం మరింత ఉత్కంఠభరిత దశకు చేరింది.