అలిపిరిలో హిందూ ధార్మిక సంస్థల ఆందోళన.. నెయ్యి కల్తీపై వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
posted on: Feb 9, 2026 1:35PM
.webp)
అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం (ఫిబ్రవరి 9) నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలను బహిరంగంగా ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేశాయి. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వైసీపీని జనం బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ప్రసాదం కల్తీ అంటే భక్తుల విశ్వాసంపై దాడి చేయడమేనని పేర్కొన్న హిందూ ధార్మిక సంఘాలు.. అంతటి పాపానికి ఒడిగట్టిన వారికి హిందువులే బుద్ధి చెప్పాలన్నాయి. వైసీపీ నేతలు వేంకటేశ్వరస్వామికి, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ధార్మిక సంస్థలు ఆ వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపాయి.


.webp)



