పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా

posted on: Apr 13, 2026 3:14PM

 

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి బాధితులతో కలిసి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది.న్యాయవాది మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఈ పరీక్షలో 27 పాయింట్ల రీడింగ్ నమోదైందని, అతను ఆల్కహాల్ సేవించి ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

అయితే, ఈ ఫలితాలను సుబ్బారావు ఖండించారు. లెక్క ప్రకారం 38 పాయింట్లు ఉండాలని, తాను ఈరోజు ఎలాంటి మద్యం సేవించలేదని చెప్పారు. రాత్రి సేవించిన మద్యం ప్రభావంతోనే రీడింగ్ వచ్చిందని పేర్కొంటూ, పోలీసులు కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, సుబ్బారావుకు మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఇదిలా ఉండగా, తమవద్ద డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం పరీక్ష నిర్వహించి, మద్యం సేవించి వాహనం నడపడం తప్పని సూచించామని తెలిపారు. పరిమితికి లోబడి పాయింట్లు నమోదు కావడంతో అవగాహన కల్పించేందుకు మాత్రమే ప్రయత్నించామని, కానీ న్యాయవాదే వాదనకు దిగారని పేర్కొన్నారు.ఈ ఘటనపై న్యాయవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...