Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్, హరీష్ పిటిషన్.. తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
posted on: Apr 8, 2026 12:35PM

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా వాయిదా పడింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించాల్సి ఉండగా అది వాయిదా పడింది. కాగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తొందరపాటు చర్యలు వద్దంటూ కోర్టు గతంలో పోలీసులను ఆదేశించిన సంగతి విదితమే.



.webp)


