దానం నాగేందర్ కు క్లీన్ చిట్.. స్పీకర్ కు హైకోర్టు నోటీసులు

posted on: Mar 23, 2026 12:52PM

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి కోర్టు కెక్కింది.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ మారారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారనీ  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు  స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.  

గత ఎన్నికలలో   బీఆర్ఎస్ అభ్యర్థిగా  ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ లో చేరి,   సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు.  అదలా ఉంచితే.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించి దశలవారీగా ఒక్కొక్కరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ పార్టీ మారారనడానికి ఆధారాలు లేవంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పీకర్ కు నోటీసు జారీ చేసింది.  తదుపరి విచారణను  ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...